ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం పరుగెడుతుంది. ఈ రేసులో అమెరికా, చైనా, రష్యా వంటి దిగ్గజ దేశాలతో భారత్ పోటి పడుతుంది. అయితే తాజా ఢిల్లిలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా అసక్తి రేపాయి. కరోనా వ్యాక్సిన్ కన్నా ముందు మన దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉందని రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. మనం మంచి రోగనిరోధక శక్తి కలిగి ఉన్నామన్న దశకు చేరుకోవచ్చని ఇంకా వ్యాక్సిన్ తో ప్రయోజనం ఉండని అన్నారు.
కానీ, కరోనా వైరస్ రోజుకో విధంగా మారుతున్న నేపథ్యంలో తీవ్రతును బట్టి రీ ఇన్ఫేక్షేన్ ను నివారించటానికి టీకాలు వేయించుకోవాలని పేర్కొన్నారు. ముందు ముందు వైరస్ స్పందించే తీరు పై అంచనా వేస్తామని.. దానిని బట్టి వ్యాక్సిన్ ఎంత తరచుగా తీసుకోవాలో అంచనాకు రావొచ్చని అర్థమవుతుందని వెల్లడించారు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చివరి దశ ప్రయోగాలు జరుపుకుంటున్న పలు కంపెనీల టీకాలు ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే సంవత్సరాం కానీ ఆమోదం పొందే ఆవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధిక జనాభ ఉన్న మన దేశంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి చేరువ చేయటం భారత్ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. కరోనా వ్యాక్సిన్ పంపిణికి ప్రభుత్వం ఇప్పటినుంచే కార్యచరణ చేపట్టింది. ఇప్పటికే అమెరికా దిగ్గజ సంస్థ తాము అభివృద్ఢి చేసిన వ్యాకిన్ 90 శాతం ఫలితాలను ఇచ్చినట్టు ప్రకటించారు. దీంతో ప్రపంచం కొంత ఊరట పొందింది. కానీ, వ్యాక్సిన్ వేసుకున్న వాలంటీర్లు సైడ్ ఎఫెక్ట్స్ అని తెలుపటం కొంత అందోళన కలిగించే ఆంశం. వచ్చే ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి