కరోనా మహమ్మారి దేశాన్నే కాదు ప్రపంచాన్నే గజగజలాడిస్తుంది. ప్రతీ నిమిషం 100 కొత్త కేసులతో ప్రపంచం వణికిపోతుంది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ఆవిష్కరణ కోసం ముమ్మరంగా పరిశోదనలు చేస్తున్నారు. కానీ ఈ మహమ్మారి శాస్త్రవేత్తలను సైతం తికమక పెడుతోంది. వారు ఎన్ని పరిశోదనలు చేసినా ప్రతీసారి మరో కొత్త సవాల్ విసురుతుంది. కొత్త సవాల్ ఎదురైన ప్రతీసారి శాస్త్రవేత్తల్లో ఆందోళన మొదలవుతుంది. ఈసారి కూడా శాస్త్రవేత్తలను ఆందోళన పెట్టేలా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ లో జెన్యు పరంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దాంతో వైరస్ కు ఇన్ఫెక్షన్ వ్యాపించే సామర్థ్యత ఇన్ఫెక్షన్ ను పెంచే సామర్థ్యత పెరిగిపోతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఇదో పెద్ద సవాల్ గా మారింది.
వైరస్ స్ట్రక్చర్ గనుక మారుతే శాస్త్రవేత్తలు ఇప్పటివరకు చేసిన పరిశోదనలు అన్నీ వృదా అవుతాయి. మరోసారి మరింత సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్ ను తయారుచేసే ఛాలెంజ్ వారికి ఎదురవుతుంది. కోవిడ్‌కు కారణమయ్యే సార్స్ కోవ్-2 వైరస్‌లో మార్పుల కారణంగా ‘డీ614జీ’ అనే కొత్త రకం వైరస్ పురుడు పోసుకుందని, దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే లక్షణాలు మరింత అధికంగా ఉన్నట్టు పరీక్షల్లో తేలిందన్నారు. వైరస్ లో ఈ కొత్త రకం మార్పును శాస్త్రవేత్తలు ఏప్రిల్ లోనే కనుగొనట్టు పేర్కొంటున్నారు. కరోనా ప్రభావం వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గనుక ఈ కొత్తరకం వైరస్ ప్రవేశిస్తే పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యే అవకాశం పొంచిఉంది. వైరస్ లో జెన్యూ పర మార్పు చిన్నదే అయినా అది శాస్త్రవేత్తలకు మరిన్ని పెద్ద ఛాలెంజ్ లను విసురుతుంది. ఇది అస్సలు సరైన పరిణామం కాదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.