మచిలీపట్నంలో వైసీపీ నేత,మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన తన కారులో విశాఖపట్నం వైపు వెళ్తుండగా తూర్పు గోదావరి జిల్లాలోని తుని మండలం సీతాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు మొదట కారు ఆపి తనిఖీలు చేసినట్లు సమాచారం.
కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం. కావాలనే కక్షసాధింపుతోనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారు. (1/3)#AnotherBCLeaderHarassedByYCP#WeStandWithKolluRavindra pic.twitter.com/IGGufosnoj
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 3, 2020
అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రాథమిక విచారణ కూడా చేయకుండా అరెస్ట్ చేయడం వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనమని ఆయన విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా.. కావాలనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారని, బీసీలంటేనే వైసీపీ పగబట్టిందని చంద్రబాబు మండిపడ్డారు. కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.