మాస్క్ పెట్టుకుంటున్నారు సరే.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..

-

కరోనా కాలంలో బ్రతుకుతున్న మనకి మాస్క్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. మాస్క్ పెట్టుకోకుండా బయటకి వెళ్ళడం ప్రమాదకరమన్న ఉద్దేశ్యంతో బయట ఉన్నంత సేపూ మాస్క్ పెట్టుకునే ఉంటున్నాం. కరోనాతో పోరాడుతున్న రోగులకి చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు రోజంతా మాస్క్ పెట్టుకుని ఉండాల్సిందే. ఐతే సాధారణ జనం కూడా బయట భయంగా ఉందన్న నేపథ్యంలో మాస్క్ పెట్టుకుని ఎక్కువ సేపు ఉంటున్నారు.

ఐతే మాస్క్ ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయని మీకు తెలుసా..?

మాస్క్ కొసలు చర్మాన్ని గట్టిగా పట్టి ఉండడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల చికాకు, దురద వంటి సమస్యలు తలెత్తి మరింత చికాకు పుట్టిస్తాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..

మొదటగా మాస్క్ చర్మాన్ని టైట్ గా తాకకుండా ఉండేలా చూసుకోవాలి.
రోజూ కనీసం రెండు సార్లయినా సబ్బునీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

అవసరం లేదనుకుంటే మాస్క్ పెట్టుకోవడం మానండి. బైక్ మీద, కార్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవద్దు.

మాస్క్ తడిగా అనిపించగానే పక్కన పెట్టేయండి. దూర ప్రయాణాలకి వెళ్ళినపుడు మీ బ్యాగులో స్పేర్ గా మరో ఐదు మాస్కులు ఉంచుకోండి.

ఒకే మాస్కుని రెండు, మూడు సార్లు వాడుతున్నప్పుడు వాటిని వేడినీటితో సబ్బు పెట్టి బాగా కడగాలి.
మాస్క్ పెట్టుకునే ముందు, తీసేసిన తర్వాత చర్మానికి తేమనందించే లేపనాన్ని రాయాలి.

మాస్క్ పెట్టుకోవడం వల్ల చర్మం పొడిగా మారితే సబ్బునీటితో కడిగేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా స్క్రబ్ చేస్తూ చేతితో కడగడం సరికాదు. దానివల్ల పొడిబారిన చర్మానికి మరింత హాని కలుగుతుంది. అందువల్ల సబ్బునీటితో ముఖాన్ని కడిగే సమయంలో జాగ్రత్తగా, నెమ్మదిగా కడగాలి.

ఇలాంటి చిట్కాలు పాటిస్తే మాస్క్ పెట్టుకున్నా చర్మానికి పెద్దగా ఇబ్బంది ఉండదు..

Read more RELATED
Recommended to you

Latest news