క‌రోనా స్పెష‌ల్‌ :  పోలీసులన్నా.. జ‌ర్న‌లిస్టుల‌న్నా.. లోకువ క‌దా…?  ఇది చ‌ద‌వండి..!

-

ప్రస్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా ఒణికిస్తోంది. మేధావుల నుంచి సామాన్యుల వ‌ర‌కు కూడా ఈ వ్యాధికి గుర‌వుతున్నారు. ఏ ఒక్క రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని, ఇంటికే ప‌రిమితం అవ్వాలని, త‌ద్వారా వ్యాది వ్యాప్తి త‌గ్గి క‌రోనా మాయం అవుతుంద‌ని ప్ర‌భుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయినా ప్ర‌జ‌లు పెడ చెవిన పెడుతున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు ఒక‌వైపు జ‌ర్న‌లిస్టులు, మ‌రోప‌క్క పోలీసులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. విభిన్న రూపాల్లో జ‌ర్న‌లిస్టులు క‌థ‌నాలు ఇస్తూ. ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో పోలీసులు త‌మ నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేస్తున్నారు.

ఇలా ఈ రెండు వ‌ర్గాలు కూడా స‌మాజాన్ని పట్టి పీడిస్తున్న క‌రోనా ఎఫెక్ట్‌ను పార‌దోలేందుకు అహ‌ర్నిశ‌లూ ప‌నిచేస్తున్నాయి. నిజానికి ఈ స‌మ‌యంలో వీరు ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుంటే.. ప్ర‌జ‌లు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ విధి నిర్వ‌హ‌ణ‌లో అటు పోలీసులు, ఇటు జ‌ర్న‌లిస్టులు కూడా త‌మ జీవితాల‌ను ఫ‌ణంగా పెడుతున్నార‌నేది వాస్త‌వం. తాజాగా  క‌రోనా దెబ్బ‌తో పోలీసులు, జర్న‌లిస్టులు కూడా ఎఫెక్ట్‌కు గుర‌వుతున్నారు.  తాజాగా ముంబైలో 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకింది.

బీఎంసీ(బృహన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో రిపోర్ట‌ర్లు, కెమెరామ‌న్‌లు క‌లుపుకుని మొత్తంగా 167 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వీరిలో సుమారు 53 మందికి సోకిన‌ట్లు తేలింది. దీంతో వెంట‌నే వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారి స‌హోద్యోగుల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ నున్నా రు. క‌రోనా సోకిన‌వారు క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన వారు కాగా టీవీ జ‌ర్న‌లిస్టుల‌కే ఎక్కువ‌గా సోకింద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీంతో వెంట‌నే వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారి స‌హోద్యోగుల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ను న్నారు.

క‌రోనా సోకిన‌వారు క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన వారు కాగా టీవీ జ‌ర్న‌లిస్టుల‌కే ఎక్కువ‌గా సోకింద‌ని అధికారులు వెల్ల‌డిం చారు. ఇక‌, పోలీసులు కూడా క‌రోనా దెబ్బ‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. మ‌న ఏపీలో ఒక ఏఎస్ ఐ అధికారికి క‌రోనా సోకింది. దీంతో ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. పంజాబ్‌లో ఏసీపీ స్థాయి ఉన్న‌తాధికారికి కూడా క‌రోనా వ‌చ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా పోలీసులు, జ‌ర్న‌లిస్టులు ప్ర‌జ‌ల కోసం చేస్తున్న ప్ర‌య‌త్నంలో క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఎందుకు గ్ర‌హించ‌లేక పోతున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌! ఇప్ప‌టికైనా మారుదాం గురూ!

Read more RELATED
Recommended to you

Latest news