ఇండియా నుంచి వెళ్ళిన కరోనా మందు ‘ నెగెటివ్ ‘ పరిస్థితి తెస్తోంది ?

-

కరోనా వైరస్ అమెరికాలో ఎంటర్ అయినా టైం లో మరణాలు భయంకరంగా సంభవిస్తున్న సమయములో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా ని హైడ్రోక్సీక్లోరోక్విన్ అనే డ్రగ్ పంపించాలని వేడుకోవడం మనకందరికీ తెలిసినదే. అడిగిన సందర్భం లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడిన ఆ తర్వాత కొద్దిగా వెనక్కి తగ్గి మోడీని వెంటనే పంపించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హైడ్రోక్సీక్లోరోక్విన్ కరోనా వైరస్ కట్టడి చేయడంలో గేమ్ చేంజర్ ట్రంప్ అభివర్ణించడం జరిగింది. ఈ మెడిసిన్ తో పాటు అజిత్రోమైసిన్ అనే యాంటీబయోటిక్ కలిపి వాడుతుంటే కరోనా వైరస్ నెగిటివ్ వస్తుందని అప్పట్లో వైద్యులు తెలపడం ప్రపంచంలోనే ఆ వార్త హైలెట్ కావటం అందరికీ తెలిసిందే.Plan to use hydroxychloroquine for COVID-19 treatment receives setback అయితే కరోనా వైరస్ కట్టడి సంగతి దేవుడెరుగు… ఈ కాంబినేషన్ మందు వాడటం వల్ల అమెరికన్లకు అంటువ్యాధులు ఇప్పుడు భయంకరంగా సంభవిస్తున్నాయట. దీంతో వెంటనే అమెరికా వైద్య నిపుణులు ఇండియా నుంచి వచ్చిన కరోనా మందు హైడ్రోక్సీక్లోరోక్విన్ ని వాడటం మానేయాలని తాజాగా సిఫార్సు  చేసింది.

 

ఇది కేవలం అవసర పరీక్షలకు తప్పించి మరి దేనికి వాడకూడదని ఆ అమెరికా నియమించిన నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ మందు వాడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని లెక్కలు బయటపడ్డాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా ఇండియా నుంచి వెళ్లిన హైడ్రోక్సీక్లోరోక్విన్ డ్రగ్ ఆపేయాలని ఆ దేశం డిసైడ్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news