యెల్లో ఫంగస్: కారణాల నుండి లక్షణాల వరకు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

-

కరోనాతో పోరాటం తీవ్రంగా ఉందనుకుంటే ఇప్పుడు ఫంగస్ లతో పోరాటం చేయాల్సి వస్తుంది. బ్లాక్, వైట్ కాగానే మళ్ళీ యెల్లో కూడా వచ్చేసింది. ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లు కరోనా కన్నా ఆందోళనగా మారాయి. ఈ నేపథ్యంలో యెల్లో ఫంగస్ గురించిన సమగ్ర సమాచారాన్ని నిపుణులు వెల్లడిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లు కరోనా లేకపోయినపుడు కూడా ఉన్నాయట. కానీ ఎవరికీ పెద్దగా తెలియలేదు. ఇక కొత్తగా వచ్చిన యెల్లో ఫంగస్ గురించి నిపుణులు పంచుకున్న విషయాలిలా ఉన్నాయి.

ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లు రావడానికి ముఖ కారణం ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, తక్కువ రోగనిరోధక శక్తి ఉండడం. శరీర జీవక్రియ మీద ప్రభావం చూపే దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉండి, కోవిడ్ రాని వారికి కూడా ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

యెల్లో ఫంగస్ ఏ విధంగా ప్రమాదకరం.

యెల్లో ఫంగస్ వల్ల తీవ్రమైన అలసట వస్తుంది. చర్మంపై దద్దుర్లు మొదలగునవి ఏర్పడతాయి. ఇంకా, ఊపిరితిత్తుల మీదనే కాకుండా శరీరంలోని ఇతర అవయవాల మీద దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ ఫంగస్ లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆలస్యం చేస్తే అది ప్రాణానికే ప్రమాదంగా మారవచ్చు.

యెల్లో ఫంగస్ కి కారణాలు

స్టెరాయిడ్లు వాడకం ఎక్కువగా ఉండడం వల్ల
కలుషితమైన వాతావరణం
డయాబెటిస్ ఎక్కువగా ఉండడం
పరిసరాలు శుభ్రంగా లేకపోవడం
శుభ్రత లేని అలవాట్లు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం
ఇతర వ్యాధులు

ఈ ఫంగస్ బారిన పడ్డ వారికి చికిత్స అందించే దగ్గర కూడా శుభ్రత పాటించాలి.

రోగి ఉన్న ప్రదేశంలో తడిగా ఉండకుండా చూసుకోవాలి.
అక్కడ అనవసరమైన వస్తువులతో చిందరవందరగా ఉంచకూడదు.
తరచుగా పరికరాలను శుభ్రం చేస్తూ, బెడ్ షీట్లను మారుస్తూ ఉండాలి.
శుభ్రమైన చేతులతో రోగికి ఆహారాన్ని అందించాలి.
ప్రతీచోట శుభ్రత పాటించాలి.
రోగి వాడడానికి శుభ్రమైన నీళ్ళని ఇవ్వాలి.
ఇతర వ్యాధులేమైనా ఉంటే పర్యవేక్షిస్తూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news