క‌రోనాతో ఫైట్ చేసేందుకు పాత టీబీ వ్యాక్సిన్‌.. ఉప‌యోగిస్తున్న వైద్యులు..

-

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ క‌రోనాకు వ్యాక్సిన్‌ను ఇంకా త‌యారు చేయ‌లేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు భిన్న‌మైన వ్యాక్సిన్ల‌ను క‌రోనా చికిత్సకు ఉప‌యోగిస్తూ ఆ వైర‌స్‌పై పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సైంటిస్టులు కూడా క‌రోనాపై పోరాటం చేయ‌డానికి పాత టీబీ వ్యాక్సిన్‌ను ప్ర‌స్తుతం టెస్ట్ చేస్తున్నారు.

Melbourne scientists using 100 year old tb vaccine to fight against corona virus

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ముర్డోచ్ చిల్డ్ర‌న్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో నైజెల్ క‌ర్టిస్ అనే ఓ ప్రొఫెస‌ర్ క‌రోనాపై ఫైట్ చేసేందుకు గ‌త 100 సంవ‌త్స‌రాల నుంచి అందుబాటులో ఉన్న పాత టీబీ వ్యాక్సిన్‌ను టెస్ట్ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌తో టీబీని, ఎర్లీ స్టేజ్‌లో ఉన్న బ్లాడ‌ర్ క్యాన్స‌ర్‌ను న‌యం చేయ‌వ‌చ్చు. ఈ వ్యాక్సిన్ ను.. bacillus Calmette-Guerin లేదా BCG అని పిలుస్తారు. ఇక దీని ఖ‌రీదు కూడా త‌క్కువే. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సైంటిస్టులు దీన్ని క‌రోనాపై ఫైట్ చేసేందుకు ప్ర‌యోగించ‌నున్నారు. ఈ వ్యాక్సిన్ శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌గానే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బాగా పెంచుతుంది. దీంతో తెల్ల ర‌క్త‌క‌ణాలు యాక్టివ్ అయి.. శ‌రీరంలోకి ప్రవేశించే వైర‌స్‌లు, బాక్టీరియాల‌ను వెంట‌నే చంపేస్తాయి. అందుక‌నే ఈ వ్యాక్సిన్‌ను సైంటిస్టులు త‌మ ప్ర‌యోగానికి ఎంచుకున్నారు.

మెల్‌బోర్న్‌లో ఉన్న 4వేల మంది హెల్త్‌కేర్ సిబ్బందికి బీసీజీ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. వీరు హాస్పిట‌ళ్ల‌లో ఇప్ప‌టికే క‌రోనా రోగుల‌కు చికిత్స అందించ‌డంలో స‌హాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వీరు క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు గాను ముందుగానే బీసీజీ వ్యాక్సిన్‌ను వీరికి ఇవ్వ‌నున్నారు. దీంతో కొద్ది రోజుల త‌రువాత వీరిని మ‌ళ్లీ ప‌రీక్షించ‌నున్నారు. ఈ క్ర‌మంలో వీరికి క‌రోనా సోక‌క‌పోతే.. అప్పుడు ఈ బీసీజీ వ్యాక్సిన్‌ను కరోనా రోగుల‌కు చికిత్స అందించేందుకు ఉప‌యోగించనున్నారు. ఇక అది స‌క్సెస్ అయితే.. క‌రోనాకు చికిత్స అందించ‌డం చాలా సుల‌భ‌త‌రం కానుంది. మ‌రి ఈ విష‌యంలో సైంటిస్టులు విజ‌యం సాధిస్తారో, లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news