కరోనా వైరస్ తర్వాత బ్లాక్ ఫంగస్ అందరినీ సతమతం చేస్తోంది. తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల్లో మరియు డయాబెటిక్ పేషంట్స్ లో వ్యాపిస్తోంది అని తెలిసింది. ఈ అధ్యయనం ఎల్సెవియర్ పత్రికలో ప్రచురించబడుతుంది.
కోల్‌కతా లోని జిడి హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్, డాక్టర్ రితు సింగ్, ముంబైలోని లీలవతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ శశాంక్ జోషి, ఢిల్లీ లో నేషనల్ డయాబెటిస్, ఊబకాయం, కొలెస్ట్రాల్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రా కలిసి 101 మంది రోగులను అధ్యయనం చేశారు.
ఇప్పటికె ప్రపంచ వ్యాప్తంగా 101 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టు గుర్తించారు. అయితే ఇది చాలా అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ చాలా సీరియస్ గా ఉంటుంది. అయితే 101 బ్లాక్ ఫంగస్ బాధితుల్లో 79 మంది పురుషులుగా గుర్తించారు. అదేవిధంగా అందులో 83 మంది డయాబెటిక్ పేషంట్స్ అని చెప్పారు.
వాళ్లల్లో 31మంది మరణించినట్లు డేటా చెబుతోంది. అదే విధంగా వాళ్లలో 60 మందికి కరోనా ఉన్నట్టు 41మంది రికవరీ అయినట్లు తేలింది. ముగ్గురికి క్యాన్సర్ ఉన్నట్లు కూడా గుర్తించారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా తీవ్రంగా మారుతోందని స్టడీ చెబుతోంది.
బ్లాక్ ఫంగస్ ముక్కు, సైనస్, ఆర్బిట్, సెంట్రల్ నెర్వస్ సిస్టం, ఊపిరితిత్తులు, డైజెస్టివ్ ట్రాక్ట్, చర్మం కిడ్నీ హార్ట్ ఇలా వీటి పై ప్రభావం చూపుతోంది. వీటిలో ఏది 89 మందికి ముక్కు మరియు సైనసిస్ లో ఫంగస్ గ్రోత్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.