రాష్ట్రం, దేశం అంతా కూడా కరోనా జపమే కనిపిస్తోంది. అక్కడ ఇన్ని కేసులు నమోదయ్యాయి. ఇక్కడ అ న్ని కేసులు నమోదయ్యాయి. వీటిలో కొత్తవి ఇన్ని.. అక్కడ కరోనా రెండో దశ ప్రారంభం.. ఇక్కడ విదే శీ ల కు బంద్. రాష్ట్రాల సరిహద్దులు మూసేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్లు. అయినా ప్రజలు రోడ్లమీదకు వ స్తూనే ఉన్నారు. పోలీసులు తమ ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఇదీ.. ఇప్పుడు ఏ మీడియా ఛానెల్ ను తి ప్పినా కనిపిస్తున్న వార్తలు, బ్రేకింగులు. అంతే తప్ప నిత్యం సందడి చేసే రాజకీయాలు ఒక్కసారిగా మూ గబోయాయి.
ఇక, తెల్లవారగానే పాఠకుల చేతిలో సందడి చేసే వార్తా పత్రికలు ఏకంగా పేజీల్లో కోత పెట్టాయి. అంతే కాదు, ఉదయం ఏడు గంటల లోపే ప్రజలు వార్తలను వండి వడ్డించేస్తున్నాయి. ఏడు దాటితే.. కర్ఫ్యూ పేరుతో ప్రజలు బయటకు రారు కాబట్టి.. పేపర్లు మిగిలిపోతాయనే భయంతో పత్రికలు తెలతెల వారు తుండగానే దర్శన మిస్తున్నాయి. అయితే, ఇందులోనూ రాజకీయ చర్చలు లేక పోవడం గమనార్హం. నిజా నికి అటు దేశం లోను, ఇటు రాష్ట్రంలోనూ కూడా రాజకీయాలు పెద్దగా జరగడం లేదు. దీనికి ప్రబుత్వం వైపు నుంచి ఎలాంటి యాక్టివిటీ లేకపోవడం ఒక కారణం.
అదేసమయంలో కరోనాతో రాష్ట్రం మొత్తం అల్లాడి పోతుంటే.. వీళ్లేంటి రాజకీయాలు మాట్లాడుతున్నారు? ప్రజలు ఎలా పోయినా ఫర్లేదా? అనే వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుందేమోనని నాయకులు కొంత జంకు తున్నారు. అయినప్పటికీ.. సోమవారం నాటి కోర్టు తీర్పుల నేపథ్యంలో టీడీపీ నాయకులు, అదేసమయం లో మధ్య ప్రదేశ్లో ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు ను కూలదోసి.. అక్కడ ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసిన బీజేపీ గురించి పెద్ద ఎత్తున పొలిటికల్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అయితే, కరో నా ఎఫెక్ట్ తో ఈ విషయాలు కూడా మరుగునపడి మొత్తానికి కరోనాదే పైచేయి అయిందని అంటున్నారు పరిశీలకులు.