పొగతాగేవారికే కొవిడ్‌ ప్రాణాంతకం: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా బారిన పడి చనిపోయిన వారిలో చాలా వరకు పొగతాగేవారే ఉన్నారని, ఆ అలవాటు ఉన్న వారికి కరోనా ప్రాణాంతకంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రస్‌ అధనమ్‌ గెబ్రియాసస్‌ శుక్రవారం తెలిపారు. పొగతాగడాన్ని మాన్పించే ఉద్దేశంతో ఒక కంపెయిన్‌ నిర్వహించారు. ఆ కంపెయిన్‌లో గెబ్రియాసస్‌ మాట్లాడుతూ దాదాపు 50 శాతం మంది టోబాకో సేవించిన వారికి కరోనా సీరియస్‌ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.‘కమిట్‌ టూ క్విట్‌’ టోబాకో కంపెయిన్‌లో గెబ్రియాసస్‌ పొగతాగేవారిలో కరోనా సోకినపుడు కేన్సర్‌ కణాలు కూడా వృద్ధి చెందుతాయని, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయని అన్నారు. మామూలు ప్రజల కంటే పొగతాగేవారిలో కొవిడ్‌ రిస్క్‌ 50 శాతం ఎక్కువ ప్రమాదకరం. పొగతాగడం మానేయడం వల్ల ఈ రిస్క్‌ నుంచి బయట పడవచ్చని గెబ్రియాసస్‌ సూచించారు.

smokers get 50 higher risk of covid

అదేవిధంగా గుండె, కేన్సర్‌ వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండవచ్చన్నారు. అందుకే అన్ని దేశాలకు మేము ఈ కంపెయిన్‌లో మాతోపాటు కలిసి టొబాకో ఫ్రీ ప్రపంచ నిర్మాణానికి తోడవ్వాలని, దీనివల్ల మంచి కోసమే పొగతాగడం మానేస్తారని తెలిపారు. పొగతాగడాన్ని మానిపించే ఉద్దేశంతో ‘క్విట్‌ ఛాలేంజ్‌’ ద్వారా కొన్ని టిప్స్‌ను కూడా అందిస్తామని, ఇవి వాట్సాప్, వైబర్, ఫేస్‌బుక్‌ ద్వారా అందిస్తామని తెలిపారు.

భారత వైద్య మంత్రికి అవార్డు బహుకరణ

ఈ కంపెయిన్‌లో భారత వైద్య మంత్రిత్వ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు డబ్లు్యహెచ్‌ఓ చీఫ్‌ అవార్డును బహుకరించారు. 2019లో పొగతాగటాన్ని కంట్రోల్‌ చేయడానికి ఈ సిగరేట్స్, ఇతర టోబాకో ఉత్పత్తులను బ్యాన్‌ చేసినందుకు ఈయనకు అవార్డు దక్కింది. భారత వైద్య మంత్రిత్వ శాఖ కూడా గెబ్రియాసస్‌తో ఏకీభవించింది. పొగతాగేవారిలో చేతుల ద్వారా నోటికి కొవిడ్‌ వైరస్‌ సోకుతుందని తెలిపింది. ‘కొవిడ్‌ 19 విపత్కర పరిస్థితుల్లో భారత్‌లో పొగతాగటం’ అనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాక్యుమెంట్‌ ద్వారా నిపుణులు ధ్రువీకరించారని వైద్య శాఖ మంత్రి తెలిపారు. అలాగే చేతుల ద్వారా సోకిన వైరస్‌ డైరెక్ట్‌గా లంగ్స్‌పై ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు.