మీ పిల్లలు కరోనా బారినపడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కరోనా ఫస్ట్ వేవ్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, సెకండ్ వేవ్ తీవ్రత పిల్లలపై ఎక్కువగా ఉంది. అందుకే పిల్లలని కరోనా బారినపడకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకిన చాలామంది పిల్లల్లో కరోనా లక్షణాలు ఉండట్లేదని, కొంత మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, ఐతే లక్షణాలెలా ఉన్నా పిల్లల వల్ల ఇతరులకి కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.

కరోనా సోకిన పిల్లల్లో ఉండే లక్షణాలలో కొన్ని, బలహీనత, తగ్గని జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు పెరగడం నోరు ఎండిపోవడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయని, ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి కరోనా టెస్ట్ చేయించుకోవాలని, దానివల్ల కరోనా తీవ్రత పెరగకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.

కరోనా బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దూరం పాటించాలి

కొత్తవాళ్ళెవరైనా ఇంటికి వస్తే వారి దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాలి. కొత్త అనే కాదు బయట నుండి ఇంటికి ఎవరు వచ్చినా వారి దగ్గరకి వెళ్ళకుండా చూసుకోవడం ఉత్తమం.

బయట ఆడుకోనివ్వవద్దు. ఇంట్లోనే ఆడుకునే విధంగా ఏర్పాటు చేయండి. వాళ్ళ స్నేహితులతో మాట్లాడాలనుకుంటే ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోతుంది.

మాస్క్ ధరించేలా చూడండి. ముక్కు కవర్ అయ్యేలా మాస్క్ ధరించేలా చూసుకోవాలి.

వ్యక్తిగత పరిశుభ్రత

ముఖం, ముక్కు, నోరుని ముట్టుకోవద్దని చెప్పాలి.
తరచుగా చేతులన్బి సబ్బుతో కడుక్కునేలా చేయండి.
తుమ్మినపుడైనా, దగ్గినపుడైనా చేతులతో ముఖం కప్పుకునేలా చూడండి.
ఆరోగ్యం బాగాలేదనిపిస్తే ఇంట్లోనే ఉండనివ్వండి.

ఇంటి శుభ్రత

ఎక్కువగా ముట్టుకునే ఉపరితలాలను శానిటైజ్ చేయాలి. తలుపు గొళ్ళెం సహా ఎక్కువగా వాడే ఉపరితలాలను శుభ్రంగా ఉంచుకోండి.

పాదరక్షలు బయటే విడవాలి

చెత్తబుట్టలని ఖచ్చితంగా వాడండి. దానిపై ఎల్లప్పుడూ మూత ఉండేలా చూసుకోండి.
ఆహారానికి ఉపయోగించే పాత్రలు తినే ముందు తిన్న తర్వాత శుభ్రంగా తోముకోండి.