తెలంగాణా కరోనా : 2,817 కేసులు, పది మరణాలు !

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక పక్క రాష్ట్రం ఏపీతో పోలిస్తే కేసుల నమోదు తక్కువే ఉన్నా ఇక్కడ కూడా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు మళ్ళీ భారీగానే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,817 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 10 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 856కు చేరింది.

ఇక ఇప్పటిదాకా కరోనా నుండి 1,00,013 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 2,611 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 32,537 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 25,293 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 59,711 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 15,42,978కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 452 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 216 కేసులతో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news