సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ప్రస్తుత సమయంలో మాస్క్ ఒక్కటే మనల్ని రక్షించేది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ విభిన్నంగా ఉండడంతో కరోనా నియమాల్లోనూ మార్పులు వచ్చాయి. అంతకుముందు ఒకే మాస్క్ పెట్టుకుంటే చాలు అన్నవారు ఇప్పుడు రెండు మాస్కులు పెట్టుకోమంటున్నారు. ఒకటి వస్త్రంతో చేసినదైతే మరోటి మెడికల్ మాస్క్ పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ విధంగా మాస్క్ పట్ల ఉన్న చాలా సందేహాలు సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సమాధానం ఇచ్చింది.
మగవారు ముఖ్యంగా గడ్డం ఎక్కువ పెంచుకోవద్దని సలహా ఇచ్చింది. మాస్క్ పెట్టుకునేటపుడు గడ్డం వల్ల గ్యాప్ ఏర్పడుతుందని, దానివల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపింది. ఇంకా ఎలాంటి మాస్కులు వాడాలని చెప్పిందంటే,
రెండు పొరలున్నా మాస్కులని వినియోగించాలి. ఉతకడానికి వీలుగా ఉండి, ఈజీగా ఊపిరి పీల్చుకోగలిగే మాస్కులు వాడాలి.
మీ నోటిని, ముక్కుని పూర్తిగా కప్పేయాలి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు.
మీ చెంపల చుట్టు చర్మానికి అనుకునే విధంగా ఉండాలి. వదులుగా ఉండి గ్యాప్ కనిపించకుండా చూసుకోవాలి.
ఇంకా ముక్కు భాగాన చిన్న వైర్ ఉండాలి. ఊరికూరికే ముక్కు మీద నుండి జారిపోకుండా ఉండడానికి అది సాయపడుతుంది.
ఎలాంటి మాస్కులు వాడకూడదంటే,
ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండే మాస్కులని వాడకూడదు. మాస్క్ వస్త్రం మంచిదై ఉండాలి.
అలాగే మాస్క్ కి ముక్కు దగ్గర చిన్న రంధ్రం ఉన్న వాటిని వాడకూడదు. దానిద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది.
ఇక ఫేస్ షీల్డ్ ల విషయానికి వస్తే, వాటి ద్వారా ఎంతమేర రక్షణ కలుగుతుందని ఇంతవరకు తేలలేదు. కానీ ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు కాబట్టి దాని గురించి ఏమీ చెప్పలేదు.
చిన్నపిల్లలకి కూడా సరిగ్గా సరిపోయే మాస్క్ మాత్రమే మాడాలి. రెండేళ్ళ కంటే తక్కువ పిల్లలకి మాస్క్ అవసరం లేదు.