కోవిడ్‌ మూడో వేవ్‌.. పిల్లల రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఇలా చేయాలి..!

-

దేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మొదటి దశలో పెద్ద వారికి కోవిడ్‌ ఎక్కువగా సోకింది. రెండో దశలో యువత ఎక్కువగా కోవిడ్‌ బారిన పడుతున్నారు. ఇక మూడో వేవ్‌ రాలేదు కానీ వస్తే మాత్రం చిన్నారులు ఎక్కువగా కోవిడ్‌ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే థర్డ్‌ వేవ్‌ వచ్చే నాటికి పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

take these steps to keep safe children from covid 3rd wave

కరోనా వైరస్‌ సోకకుండా పిల్లలను ముందే సిద్ధం చేయాలని, వారి పట్ల జాగ్రత్తలను తీసుకోవాలని ప్రముఖ న్యూట్రిషనిస్టు శివాని సిక్రి సూచించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పలు ముఖ్యమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది. కరోనా సమయం కనుక చిన్నారులకు అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ ఇవ్వాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

చిన్నారులకు తరచూ కోడిగుడ్లు, చేపలు, పప్పు దినుసులు, బీన్స్‌, తృణ ధాన్యాలు, నట్స్‌, అవిసెగింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు తదితర ఆహారాలను ఇవ్వాలి. విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కనుక ఆ విటమిన్‌ ఉండే నారింజ పండ్లు, మామిడి, ఉసిరికాయలు, పైనాపిల్‌, కివీ, టమాటాలు, స్ట్రాబెర్రీలు, క్యాప్సికమ్‌ వంటి ఆహారాలను పిల్లలకు ఇవ్వాలి.

శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలో జింక్‌ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. జింక్‌ ఉండే మాంసం, విత్తనాలు, నట్స్‌, తృణ ధాన్యాలు, శనగలను ఇవ్వాలి. రోజూ ఆహారంలో పసుపును పిల్లలకు ఇవ్వాలి. పాలలో పసుపు కలిపి ఇవ్వాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఛాతిలో ఉండే శ్లేష్మం కరుగుతుంది. అలాగే సోయా, పెరుగు, బీట్‌రూట్‌, పాలు, తాజా పండ్లు, కూరగాయలు తదితర ఆహారాలను ఇవ్వాలి.

చిన్నారులను టెక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచాలి. లేదా కొంత సమయం పాటు మాత్రమే వాటిని ఉపయోగించేలా చూడాలి. రోజూ యోగా, వ్యాయామం చేయించాలి. మానసికంగా దృఢంగా ఉంచాలి. చిన్నారులకు రోజూ 8-10 గంటల నిద్ర ఉండేలా చూడాలి. రోగ నిరోధక శక్తి విషయంలో నిద్ర కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్క, లవంగాలు, యూకలిప్టస్‌, లెమన్‌, రోజ్‌ మేరీ వంటి ఎసెన్షియల్‌ ఆయిల్‌ను వాడాలి. వాటిల్లో యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. ఇవి చిన్నారులను రక్షిస్తాయి.

చిన్నారులను బయట ఆడుకునేందుకు అనుమతించరాదు. ఎవరైనా ఇతర పిల్లలు వస్తే వారితో కలవకుండా చూడాలి. స్వల్ప లక్షణాలు కనిపించినా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్‌ ప్రాణాంతకం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోవిడ్‌ మూడో వేవ్‌ నుంచి పిల్లలను రక్షించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news