ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ గా గులాబ్ తుఫాను.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలను గులాబ్ తుఫాను గుబులు రేపుతోంది. తాజాగా తుఫాను ప్రమాద తీవ్రత పెరగడంతో ఏపీ, ఒడిషాకు ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీచేసింది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండంగా నుంచి తీవ్రతుఫానుగా గులాబ్ మారింది. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ 2021లో వచ్చిన మూడో తుఫాన్. ఈ ఏడాది మేలో తౌటే, యాస్ తుఫానులు సంభవించాయి.

ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలైన గోపాలపురం, కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తీరం వెంబడి 17 -70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కోస్తా మార్గంలో నడిచే 24 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది మ మత్స్యకారులు చేపల వేలకు వెళ్లోద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.