డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడే వారికి శుభవార్త..!

-

చాలా మంది డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. మీరు కూడా డెబిట్ కార్డు ని ఉపయోగిస్తున్నారా? లేదంటే క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. కొత్త రూల్స్ అమలు లోకి వచ్చాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

credit card | క్రెడిట్ కార్డు
credit card | క్రెడిట్ కార్డు

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కొత్త నిబంధనలు తీసుకు వస్తోంది. అయితే ఈ రూల్స్ ప్రకారం కార్డు కలిగిన వారు సీవీవీ నెంబర్ ఎంటర్ చేయకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. అయితే ఎందుకు ఈ మార్పు అనేది చూస్తే.. రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం అవ్వనున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ కొత్త రూల్స్ 2022 జనవరి నుంచి అమలులోకి వస్తున్నాయి. అయితే కార్డు వివరాల స్థానం లో టోకెనైజేషన్ వ్యవస్థను అమలు లోకి తీసుకు రానున్నారు.

అంటే కార్డు ట్రాన్సక్షన్స్ ని చేసేటపుడు కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు. దీంతో మీ కార్డు సమాచారం ఎవ్వరికీ తెలియదు. మీ వివరాలు సురక్షితంగానే ఉంటాయి. కనుక ఈ మార్పు చేస్తే మంచిదే. ఆర్‌బీఐ ఇప్పటికే మర్చంట్లకు ఆదేశాలు జారీ చేసింది. కార్డు వివరాలు స్టోర్ చేసుకోవద్దని తెలిపింది.

ఇది ఇలా ఉంటే గూగుల్ పే, పేటీఎం, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ వంటి వాటిల్లో కార్డు వివరాలు ఎంటర్ చేసినప్పుడు.. ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డు వంటి వాటికి టోకెన్ కోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. కస్టమర్ డివైజ్‌తో ఇవి లింక్ అవుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news