హోలీ స్పెషల్ చాక్లెట్ పాన్ ని ఇలా ఈజీగా చేసుకోండి..!

Join Our Community
follow manalokam on social media

హోలీ అంటేనే మంచి మంచి వంటలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దహీ బలే, గుజియా, పానీపూరి ఇలా చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్కరూ పాన్ కూడా చేసుకుంటారు. అయితే రొటీన్ పాన్ కాకుండా చాక్లెట్ తో కోట్ చేసిన పాన్ ని కనుక తీసుకుంటే ఇంకా బాగుంటుంది.

అందుకే ఈరోజు దానిని ఎలా చెయ్యాలో ఇక్కడ చెప్పడం జరిగింది. మరి చాక్లెట్ పాన్ కి కావాల్సిన పదార్ధాలు ఏమిటి..?, ఎలా చేసుకోవాలి..? అనేది ఇప్పుడు చూసేద్దామా…

చాక్లెట్ పాన్ కి కావాల్సిన పదార్థాలు:

గుల్కన్డ్
ముఖ్వాస్
పాన్ చట్నీ
కొబ్బరి పొడి
ఖర్జూరం
సోంపు
చెర్రీస్
చాక్లెట్ గనాచె
తమలపాకులు

చాక్లెట్ పాన్ ని తయారు చేసుకునే విధానం:

ముందుగా తమలపాకులు తీసుకుని దానికి పాన్ చెట్నీ రాయండి. ఇప్పుడు ముఖ్వాస్, కొబ్బరి పొడి, ఖర్జూరం మరియు సోంపు ని తీసుకోండి. వీటిని కూడా పెట్టేసి చాక్లెట్ గనాచే ని కూడా పెట్టేసి కోన్ షేప్ లో మడత పెట్టేయండి. ఇప్పుడు ఈ పాన్ నీ చాక్లెట్ సాస్ లో డిప్ చేసి చెర్రీస్ ని పెట్టండి అంతే చాక్లెట్ పాన్ అయిపోయింది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...