ఢిల్లీ నుంచి వారణాసి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు శనివారం నాడు గాల్లో ఉండగానే ఆ విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. ఫుల్పూర్ లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రకారం, ఇలా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి మానసిక సమస్యలతో ఉన్నట్లు అనిపించిందని అన్నారు. ఒక ప్రయాణీకుడు ఢిల్లీ నుంచి వారణాసి వెళుతున్న విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు.
విమానాశ్రయం వద్ద విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యే వరకు క్రూ సభ్యులు అతన్ని ఆపి పట్టుకున్నారు. విమాన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్ చేయమని అభ్యర్థించారు అని ఆయన పేర్కొన్నారు. ల్యాండ్ అయ్యాక ఈ ప్రయాణికుడిని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి అప్పగించారు. అయితే మానసిక సమస్యల కారణంగా ఆయన అలా చేశాడు అంటూ ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు తెలియాల్సి ఉంది.