ద్రావిడ్ తర్వాత వన్డేల్లో ఆ స్థానానికి ఎవరూ దొరకలేదు…!

-

టీం ఇండియాలో గ్రేట్ వాల్ ద్రావిడ్ తన ముద్ర వేసేసాడు అనడానికి ఎన్నో మ్యాచులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్ లో ద్రావిడ్ ఉంటే అభిమానులకు ఒక నమ్మకం. గట్టేక్కిస్తాడు లే అనే ధైర్యం. ఓపెనర్ల వికెట్లు తీసి సంబరపడిన ప్రత్యర్ధి టీం కెప్టెన్ కి ద్రావిడ్ వికెట్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. అలా తాను ఏంటో నిరూపించాడు ద్రావిడ్. టెస్టుల్లో ద్రావిడ్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వన్డేల్లో ద్రావిడ్ గురించి చాలా మందికి తెలియదు. నాలుగో స్థానంలో ద్రావిడ్ పోషించిన రోల్ గురించి చాలా మందికి అవగాహన లేదు కూడా. వాస్తవానికి నాలుగో స్థానం అనేది జట్టుకి వెన్నుముఖ లాంటిది. వన్డేల్లో అయితే అది మరీ ఎక్కువ. రెండు వికెట్లు పడ్డాయి అనగానే 4 స్థానం మీద భారం పడుతుంది. ద్రావిడ్ ఆ భారాన్ని సమర్ధవంతంగా దశాబ్దం పాటు మోసాడు. ద్రావిడ్ వన్డేలకు దూరమైన తర్వాత యువరాజ్ సింగ్ కొంత కాలం సమర్ధవంతంగానే మోసాడు.

కాని ఇప్పటి వరకు ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీం ఇండియాకు దొరకలేదు అనేది వాస్తవం. అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, ఇర్ఫాన్ పఠాన్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అజింక్యా రహానే, విజయ్ శంకర్ ఇలా ఎందరినో ఆ స్థానం కోసం టీం ఇండియా యాజమాన్యం పరిశీలించింది. అయినా సరే ఆ స్థానం ఇప్పటికి భర్తీ అవ్వలేదు. అయితే ఇటీవల శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఆ స్థానంలో ఆడటానికి సమర్ధుడు అనే పేరు వచ్చినా, ఆ స్థానంలో ఒత్తిడి ఎంత వరకు తట్టుకుని ఆకట్టుకుంటాడు అనేది చూడాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news