వాలెంటైన్స్ డే: భయంతో వ‌ణుకుతున్న హైదరాబాద్‌ ప్రేమ జంట‌లు.. ఎందుకో తెలుసా..?

ప్రేమ‌.. ఎప్పుడు.. ఎవ‌రి మ‌ధ్య‌.. ఎలా పుడుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. అయితే ‘వాలెంటైన్స్ డే’ నేపథ్యంలో మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ప్రేమ కురించి చెప్పలానుకుంటున్నారా? అయితే ఈ రోజు చెప్పేయండి. వాలెంటైన్స్ డే, లవర్స్ డే, ప్రేమికుల దినోత్సవం, ప్రేమికుల రోజు… ఇలా పేరు ఏదైతేనేం… ప్రేమపక్షులకు అత్యంత ఇష్టమైన రోజు ఇదే. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా ప్రేమ జంటలు పండుగ చేసుకుంటున్నాయి. అయితే, ‘వాలెంటైన్స్ డే’ని గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటోన్న తెలంగాణ ప్రేమ జంటలకు బజరంగ్‌దళ్ సభ్యుల భయం పట్టుకుంది. ప్రేమలో మునిగితేలుతోన్న తమను పట్టుకుని, పెళ్లి చేస్తారేమోనని వణికిపోతున్నారు.

దీంతో ఈ విషయాలను ప్రస్తావిస్తూ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో ఓ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణలో ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆల్‌ ఇండియా దళిత, క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రేమించుకుంటోన్న వారికి రక్షణ కల్పించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌లో ఓ పిటిషన్‌ దాఖలు చేశాయి.