women’sday;స్మృతి క్రికెట్ లో మహారాణి..!

-

స్మృతి శ్రీనివాస్ మంధనా… క్రికెట్ మీద అవగాహన ఉన్న ఎవరికి అయినా ఈమె పేరు సుపరిచితం. టీం ఇండియా ఓపెనర్ గా… అది కూడా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ గా ఆమె ఒక సంచలనం. ఆమె ఆట తీరు చూసి ఉమెన్ యువరాజ్ అన్నారు అందరూ…18 జూలై 1996లో జన్మించిన మంధనా… తొమ్మిదేళ్ల వయసులో, ఆమె మహారాష్ట్రలోని అండర్ -15 జట్టులో ఎంపికైంది. పదకొండు సంవత్సరాల వయసులో, ఆమె మహారాష్ట్ర అండర్ -19 జట్టుకు ఎంపికైంది.

అక్టోబర్ 2013 లో జరిగిన దేశవాళి వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా నిలిచింది. గుజరాత్‌, మహారాష్ట్ర మ్యాచ్ లో ఆమె వెస్ట్ జోన్ అండర్ -19 టోర్నమెంట్‌లో వడోదరలోని అలెంబిక్ క్రికెట్ మైదానంలో 150 బంతుల్లో అజేయంగా 224 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆమె కెరీర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. 2014 ఆగస్టులో వార్మ్స్లీ పార్క్‌లో ఇంగ్లండ్‌పై మంధనా టెస్ట్‌ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.

ఆమె తన రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా 22 మరియు 51 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో 2016 లో భారత ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన రెండవ వన్డే గేమ్‌లో, మంధనా తన తొలి అంతర్జాతీయ సెంచరీని (109 బంతుల్లో 102) సాధించింది. ఐసిసి ఉమెన్స్ టీం ఆఫ్ ది ఇయర్ 2016గా నిలిచిన ఏకైక భారతీయ క్రీడాకారిణి మంధనా.

ముఖ్యంగా మిథాలి రాజ్ స్ఫూర్తి సహకారంతో ఆమె అంతర్జాతీయ క్రికెట్ లో రాణించింది. ఎక్కడా వెనకడుగు వేయకుండా మంధనా తన కెరీర్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా తన బ్యాటింగ్ స్టైల్ తో పాటు గ్లామర్ తో కూడా మంధనా ఆకట్టుకుంది. ప్రస్తుతం టీం ఇండియా ఓపెనర్ గా కొనసాగుతుంది. జూన్ 2018 లో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా ప్రకటించింది.

డిసెంబర్ 2018 లో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు సంవత్సరపు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది. అదే సమయంలో ఆమె ఐసిసి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక అయింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ప్రేమతో ఆమె బ్యాట్ పట్టింది. మహారాష్ట్ర రాష్ట్ర అండర్ -16 టోర్నమెంట్లలో తన సోదరుడు ఆడటం చూసిన తరువాత క్రికెట్ మీద మక్కువ పెంచుకుని క్రికెట్ లో దూసుకుపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news