కోహ్లిని మించిన ఆటగాడు అతడు…!

-

ఎప్పుడో 2007 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2013 లో వరకు అతనికి గుర్తింపు లేదు, అప్పటి వరకు మిడిల్ ఆర్డర్ లో ఆడటమే గాని ఓపెనర్ గా అవకాశమే రాలేదు. దీనితో అతని ఆటకు మిడిల్ ఆర్డర్ సరిపోలేదో ఏమో పాపం అవకాశాలు వచ్చినా సరే నిరూపించుకోలేకపోయాడు. కాని 2013 చాంపియన్స్ ట్రోఫీలో ధోని ఓపెనర్ గా అవకాశం ఇచ్చాడు. అంతే అక్కడి నుంచి కెరీర్ ఊపందుకుంది. వన్డేల్లో సచిన్ కి మాత్రమే సాధ్యమైన డబుల్ సెంచరీని ఈ ఏడేళ్ళలో మూడు సార్లు సాధించాడు.

ఇంతకి ఆ ఆటగాడు ఎవరా అనుకుంటున్నారా…? టీం ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సెహ్వాగ్ వారసుడు అనిపించుకునే స్థాయిలో అతని విధ్వంశం ఉంటుంది. కాకపోతే ఒకటే తేడా… సెహ్వాగ్ మొదటి బంతి నుంచి బాదుడే. కాని రోహిత్ నిలబడిన తర్వాత బాదడం మొదలుపెడతాడు. ఆ బౌలర్ ఈ బౌలర్ అనే తేడా గాని జాలి దయ గాని అతనికి ఉండవు. ఈ ఏడాది 28 వన్డేలు ఆడిన రోహిత్ 57 సగటుతో 1490 పరుగులు చేసాడు రోహిత్. 5 టెస్టులు ఆడిన, 92 సగటు తో 556 పరుగులు చేసాడు. 14 టి20లు ఆడిన రోహిత్ 28 సగటు తో, 396 పరుగులు చేసి సత్తా చాటాడు రోహిత్.

రోహిత్ 26 వన్డేలు ఆడి 1377 పరుగులు చేస్తే అతని కంటే రెండు మ్యాచులు ఎక్కువ ఆడి ఎక్కువ సగటు నమోదు చేసాడు. కోహ్లి 8 టెస్టుల్లో 612 పరుగులు 68 సగటుతో చేస్తే రోహిత్ కంటే తక్కువ ప్రదర్శనే. ఒకప్పుడు కోహ్లి మాత్రమే నిలకడ ఆటగాడు అనుకునే వారు. కాని రోహిత్ మాత్రం అతన్ని మించిన నిలకడతో అంతర్జాతీయ క్రికెట్ లో మోడరన్ డే గ్రేట్ అనిపించుకున్నాడు. 2019 లో కోహ్లి ని మించిన ఆట తీరుతో సారధ్యంతో రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ లు అతని స్థాయిని పెంచాయి.

32 ఏళ్ళ రోహిత్ మరో నాలుగేళ్ల పాటు ఇదే స్థాయిలో ప్రదర్శన చేస్తే మాత్రం మరిన్ని రికార్డులు అతని సొంతం కావడం ఖాయం. టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఆకట్టుకోలేని రోహిత్ ఈ ఏడాది ఓపెనర్ గా అవతారం ఎత్తి తొలి సీరీస్ లోనే సెంచరి, డబుల్ సెంచరి సాధించి సత్తా చాటాడు. రోహిత్ ఓపెనర్ గా ఆడితే టీం ఇండియా భారి స్కోర్ సాధించినట్టే. ఇక విదేశీ ఫాస్ట్ పిచ్ ల మీద కూడా రోహిత్ ఓపెనర్ గా ఆడితే మాత్రం అతనికి ధీటైన ఆటగాడు రాబోయే నాలుగేళ్లలో లేనట్టే. 2019 మాత్రం అతనికి దారుణంగా కలిసి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news