Fact Check: కోవిడ్ బాధితులు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌కు బ‌దులుగా నెబ్యులైజ‌ర్ వాడ‌వ‌చ్చా ?

-

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య ఎప్ప‌టికప్పుడు పెరిగిపోతోంది. అనేక మంది ఇండ్లు, హాస్పిట‌ళ్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ బాధితుల‌కు ఆక్సిజ‌న్ పెద్ద ఎత్తున అవ‌స‌రం అవుతోంది. దీంతో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, కాన్‌స‌న్‌ట్రేట‌ర్ల‌కు డిమాండ్ భారీగా ఏర్ప‌డింది. అయితే కోవిడ్ బాధితులు నెబ్యులైజ‌ర్‌తో చికిత్స తీసుకోవ‌చ్చు.. అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

can covid patients use nebulizer instead of oxygen cylinder fact check

కోవిడ్ చికిత్స తీసుకునే వారు ఆక్సిజ‌న్ కోసం నెబ్యులైజ‌ర్ వాడ‌వ‌చ్చ‌ని, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లేదా కాన్‌స‌న్‌ట్రేటర్ లేక‌పోయినా ఏమీ కాద‌ని.. ఓ వార్త సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ లో ఆ వార్త ఫేక్ అని తేలింది. అదంతా అబ‌ద్ద‌మేన‌ని, కోవిడ్ చికిత్సలో ఆక్సిజ‌న్ కోసం నెబ్యులైజ‌ర్ వాడ‌కూడ‌ద‌ని, అన‌వ‌స‌రంగా ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని పీఐబీ తెలియ‌జేసింది.

నెబ్యులైజ‌ర్ ను సాధార‌ణంగా శ్వాస స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వాడుతారు. ఆస్త‌మా ఉన్న‌వారితోపాటు చిన్నారుల్లో జ‌లుబు, ముక్కు దిబ్బడ ఉంటే శ్వాస స‌రిగ్గా ఆడేందుకు నెబ్యులైజ‌ర్ ఉప‌యోగిస్తారు. అంతేకానీ దాంతో ఆక్సిజ‌న్ వెలువ‌డ‌దు. క‌నుక కోవిడ్ బాధితులు ఈ విష‌యం గ‌మ‌నించాలి. కోవిడ్ చికిత్స‌లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, కాన్‌సన్‌ట్రేట‌ర్ల‌కు బ‌దులుగా నెబ్యులైజ‌ర్‌ల‌ను వాడ‌రాదు.

Read more RELATED
Recommended to you

Latest news