ఫ్యాక్ట్ చెక్: ఫేస్ బుక్ పేరు మారుతోందా..? నిజమెంత..?

ఫేస్ బుక్ యాప్ గురించి తెలియని వారు ఉండరు. చాలామంది ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. ఫేస్ బుక్ లో స్నేహితులు చేసుకోవడం, తమకు నచ్చిన పోస్టులను పెట్టడం ఇలా ఫేస్బుక్ లో చాలా మంది వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అలానే ఎవరికి నచ్చిన వాటిని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియ చేస్తూ ఉంటారు. ఫేస్బుక్ ని 2004 ఫిబ్రవరి 4న రిలీజ్ చేయడం జరిగింది.

facebook

ఆ తర్వాత నుండి చిన్న చిన్న మార్పులు చేస్తూ.. అప్డేట్ చేస్తూనే ఉన్నారు. మెసేజింగ్, బిజినెస్, మార్కెటింగ్ ఇలా ఇది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇక ఫేస్ బుక్ పేరు నిజంగా మారబోతుందా…?, దీనిలో నిజమెంత అనేది చూస్తే… ఈ మధ్య కాలంలో విపరీతంగా ఫేక్ వార్తలు వినబడుతున్నాయి. అయితే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ప్రజలకు అర్థం కావడం లేదు.

ఎప్పుడైనా సరే పూర్తిగా ఏదైనా తెలిసే వరకు కూడా నమ్మడం మంచిది కాదు. ఫేస్ బుక్ పేరు త్వరలో మారబోతోందని… దాని పేరు మెటావర్స్ అని తెలుస్తోంది. అయితే నిజంగా పేరు మారుతుందా అనేది చూస్తే… ఈ విషయంపై ప్రముఖ సాంకేతిక నిపుణులు శ్రీధర్ నల్లపోతు ఒక క్లారిటీ ఇచ్చారు.

ఫేస్బుక్ అనే పేరు మారదని కేవలం సంస్థ భవిష్యత్తు లక్షణాలను దృష్టిలో ఉంచుకుని వర్చువల్ రియాలిటీ మరియు ఇతర వాటిని దృష్టిలో పెట్టుకుని మెటావర్స్ అనే సంస్థ పేరుగా అది మారుతుందని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్ యాప్స్ అయిన ఫేస్బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ యాప్స్ ని ఓపెన్ చేసినప్పుడు పవర్డ్ బై ఫేస్బుక్ అనేది రాకుండా మెటావర్స్ అని కనిపిస్తుంది. అంతేకానీ ఫేస్బుక్ యాప్ పేరు మారదు అని క్లియర్ గా తెలుస్తోంది.