ఫ్యాక్ట్ చెక్: వాణీ పధకం కింద కేంద్రం వైఫై..?

స్కీమ్స్ విషయంలో మనం జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ మధ్యన సులభంగా నకిలీ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. చాలా మంది ఇలాంటి నకిలీ వార్తల బారినపడి నష్టపోతున్నారు. అందుకని ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవాలి.

 

సోషల్ మీడియాలో ఈ మధ్య నకిలీ వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అటువంటి వాటికి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనవసరంగా చిక్కుల్లోపడతారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త వచ్చింది అయితే ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

పీఎం వాణి యోజన కింద ప్రజలకి ఇంట్లో వైఫై ప్యానెల్ ని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం అని ఒక వార్త వచ్చింది. దానికోసం 650 రూపాయలు చెల్లించాలని అన్నారు. అలానే ఉద్యోగాలు, అద్దె 15000 రూపాయలు అందుతాయి. పైగా ఈ ప్యానెల్ ని ఇన్స్టాల్ చేయడానికి కొద్దిగా స్థలం కావాలి అని వార్త లో ఉంది.

ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది పూర్తిగా నకిలీ వార్త అని తెలుస్తోంది టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఏ వ్యక్తి నుండి ఎలాంటి డబ్బును కూడా అడగడం లేదు. కనుక ఇటువంటి వార్తలను నమ్మి మోసపోవద్దు ఇతరులకు షేర్ చేయొద్దు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తుంది కానీ ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు.