ఫ్యాక్ట్ చెక్: వంద కోట్ల కోవిడ్ వ్యాక్సిన్స్ ని ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చిందా..?

అక్టోబరు 22 శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులని భారతదేశంలో ప్రజలకి ఇచ్చారని… పైగా వీటిని ఫ్రీగా అందించారని చెప్పారు. డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా అందరికీ కూడా వ్యాక్సిన్ ని పంపిణీ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అయితే నిజంగా భారత ప్రభుత్వం భారతదేశంలో ప్రజలందరికీ వంద కోట్ల వ్యాక్సిన్ డోసులని ఫ్రీగా ఇచ్చిందా..? ఇక దీని కోసం పూర్తిగా చూస్తే…

అయితే కొన్ని వ్యాక్సిన్ల కి డబ్బులు కట్టాల్సి వచ్చిందని… ప్రైవేట్ సెంటర్లలో వ్యాక్సిన్ ని ప్రజలు డబ్బులు చెల్లించారని… ఫ్రీ గా వాటిని ఇవ్వలేదని మనకి తెలిసిందే. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఫ్రీగా వంద కోట్ల వ్యాక్సిన్ డోసులని అందించినట్లు చెప్పారు.

జూన్ 2021 లో కొత్త వ్యాక్సిన్ పాలసీని తీసుకురావడం కూడా జరిగింది. అయితే అప్పుడు 75 శాతం వాక్సిన్స్ ని ఫ్రీగా ఇస్తున్నట్లు 25 శాతం కొనుగోలు చేయాలని మరియు వాటిని ప్రైవేట్ ఆస్పత్రిలో తీసుకోవాలని చెప్పారు. దీని ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఫ్రీగా ఇవ్వలేదని తెలుస్తోంది. 5:35 నిముషాల దగ్గర మనం దీనిని వినచ్చు.

ప్రైవేట్ ఆస్పత్రిలో 150 రూపాయలుని ఒక డోస్ కి సర్వీస్ ఛార్జ్ కింద తీసుకున్నారు. దీనితో భారతదేశంలో 780 రూపాయలకు కోవిషీల్డ్ కొనుగోలు చేయడం జరిగింది. అలాగే రూ.1,410
కొవ్యాక్సిన్ ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. స్పుట్నిక్ ని రూ.1145 కి కొనుగోలు చేయాల్సి వచ్చింది.