ఫ్యాక్ట్ చెక్ : ఇలాంటి ఈమెయిల్స్ మీకు వచ్చాయా..? జాగ్రత్త సుమా..!

-

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పేదేముంది. అనేక నకిలీ వార్తలు మనకి తరచూ సోషల్ మీడియాలో కనబడుతుంటాయి. నకిలీ వార్తల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే మోసపోవాల్సి వస్తుంది. నకిలీ వార్తల్ని వివిధ రకాలుగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఫోన్లకి మెసేజ్లు రావడం మెయిల్స్ పంపడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు.

ఫ్యాక్ట్ చెక్
ఫ్యాక్ట్ చెక్

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుండి మెయిల్స్ పంపిస్తున్నారు. అయితే నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు. ఇది వట్టి నకిలి వార్త మాత్రమే.

ఇటువంటి మెయిల్స్ ని కేంద్ర ప్రభుత్వం ఎవరికి పంపడం లేదు. ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే. మోసగాళ్లు మోసం చేయడానికి ఒక మార్గం అని తెలుస్తోంది. అనవసరంగా ఇటువంటి మెయిల్స్ ని చూసి నమ్మకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది కేంద్ర ప్రభుత్వానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. కనుక అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news