ఫ్యాక్ట్ చెక్: నోట్లు మీద ఏమైనా రాస్తే.. అవి చెల్లవా..?

-

ఈ మధ్య కాలంలో మోసాలు మామూలుగా లేవు చాలా మంది ఎన్నో రకాలుగా మోసపోతున్నారు.ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఫేక్ వార్తలు కి దూరంగా ఉండడమే మంచిది. సోషల్ మీడియాలో తరచు మనకి అనేక ఫేక్ వార్తలు కనబడుతూ ఉంటాయి ఇటువంటి వాటికి దూరంగా ఉండకపోతే అనవసరంగా మోసపోవాల్సి వస్తుంది. పైగా చాలా మంది ఏది నిజం ఏది అబద్దం అని తెలియకుండా వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అటువంటి వాటిని అసలు ఫార్వర్డ్ చేయకూడదు.

నకిలీ వార్తలని ఫార్వర్డ్ చేయడం వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. బ్యాంకు నోట్ల మీద ఏమైనా రాస్తే అవి పని చేయవని ఒక వార్త వచ్చింది మరి నిజంగా అటువంటి నోట్లు పని చేయవా ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. క్లీన్ నోట్ పాలసీ కింద ఎవరూ కూడా కరెన్సీ నోట్ల మీద ఎటువంటి అక్షరాలు రాయకూడదు. ఇటువంటివి రాయడం వలన నోట్లు త్వరగా పాడైపోతాయి.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుఎస్ డాలర్ల లాగ మన నోట్ల మీద కూడా ఏమీ రాయకూడదు అని.. అలా రాస్తే ఆ నోట్లు చెల్లవని చెప్పిందా అనేది చూస్తే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చెప్పలేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే కనుక ఇటువంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండండి. అయితే నోట్ల మీద రాయడం మంచిది కాదు నోట్లు త్వరగా పాడైపోతాయి కాబట్టి రాయకుండా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news