ఫ్యాక్ట్ చెక్: ‘MSME Udyam’ రిజిస్టర్ చేసుకోమని వచ్చిన వెబ్ సైట్ నిజమేనా…?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు బాగా ఎక్కువై పోయాయి. సోషల్ మీడియా అడ్వాన్స్ అయినా కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. పైగా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం అవ్వడం లేదు. మోసగాళ్లు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ నకిలీ వెబ్ సైట్ ని గుర్తించింది . ఎంఎస్ఎంఈ ఉద్యమ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని… 2,700 రూపాయలు ప్రింటింగ్ కోసం ఇవ్వాలని తెలిపింది. అయితే ఈ డబ్బులు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ప్రింటింగ్ కోసం. ఇందులో నిజమెంత అనేది చూస్తే… ఇది పూర్తిగా నకిలీ వార్త అని నకిలీ వెబ్ సైట్ అని తెలుస్తోంది.

వెబ్ సైట్ యొక్క యూఆర్ఎల్ ‘eudyogaadhaar.org’. గతంలో కూడా చాలా నకిలీ రిజిస్ట్రేషన్ కేసులు వచ్చాయి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది నకిలీ వెబ్ సైట్ అని.. నిజమైనది కాదని తెలిపింది. కాబట్టి అనవసరంగా మోసగాళ్ల చేతిలో మోసపోకండి. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకుని వ్యవహరించండి. లేదంటే మీరే నష్టపోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news