ఫ్యాక్ట్ చెక్: కేంద్రం మూడు నెలలు ఉచిత రీఛార్జ్ ఇస్తోందా..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. దీని వల్ల చాలా మంది నిజమనుకుని ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అది నిజమో కాదో ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. కరోనా వచ్చినప్పటి నుండి కూడా ఆక్సిజన్ల గురించి మందుల గురించి ఇలా ఎన్నో ఫేక్ వార్తలు వచ్చాయి.

 

అయితే ఇప్పుడు వాట్సాప్ లో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఇండియన్ యూజర్స్ కి ప్రధాని నరేంద్ర మోడీ మూడు నెలల పాటు ఫ్రీ మొబైల్ రీఛార్జ్ ఇస్తున్నారని ఒక వార్త వచ్చింది. అయితే దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.

నరేంద్ర మోడీ ఫ్రీ గా మూడు నెలల పాటు రీఛార్జ్ ఇవ్వడం అనేది కేవలం ఫేక్ న్యూస్. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రభుత్వం ఏమి ఇలాంటి న్యూస్ ని అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇటువంటి ఫేక్ మెసేజ్లని నమ్మద్దు. వాట్సాప్ లో వచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్ ఐడియా యూజర్లకి మూడు నెలల పాటు ప్రభుత్వం ఫ్రీ రీఛార్జ్ ఇస్తుందని ఉంది. అయితే ఇలాంటి ఫేక్ వార్తలని అసలు నమ్మద్దు ఫార్వర్డ్ చెయ్యొద్దు.