ఫ్యాక్ట్ చెక్ : ఈ లక్కీ డ్రా తో రూ.6,000.. నమ్మచ్చా..?

-

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తరచు మనకు ఎన్నో నకిలీ వార్తలు కనిపిస్తూ ఉంటాయి. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోక పోతే ఎంతో కష్టం. నకిలీ వార్తలని చూసి చాలా మంది మోసపోతున్నారు. ఉద్యోగాలు మొదలు స్కీముల వరకు ఎన్నో నకిలీ వార్తలు తరచూ మనకే సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది.

ఫ్యాక్ట్ చెక్
ఫ్యాక్ట్ చెక్

మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.. పోస్ట్ నేషనల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద రూ. 6000 రూపాయలని గెలుచుకునే అవకాశాన్ని పొందచ్చని ఒక వార్త సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. మరి ఇది నిజమేనా ఈ లక్కీ డ్రా ద్వారా డబ్బులు గెలుచుకోవచ్చా..?

ఇండియా పోస్ట్ ఆఫీస్ కి దీనిలో సంబంధం ఉందా అనే విషయాన్ని చూసేస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇండియా పోస్ట్ ఆఫీస్ కి ఈ వార్త కి ఏ సంబంధం కూడా లేదు. 6000 రూపాయలు వస్తాయి అన్నది వట్టి నకిలీ వార్త మాత్రమే కేవలం మోసం చేయడానికి మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news