Fact Check: 2023లో 1000 నోట్లు మళ్లీ రానున్నాయా..?

-

సోషల్‌ మీడియో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్‌ అవుతోంది.. ట్రోల్స్‌, రూమర్స్‌, వైరల్‌ వీడియోస్‌ ఇలా బోలెడు.. ఇప్పుడు కొత్త సంవత్సరంలో వెయ్యి నోట్లు మళ్లీ వస్తున్నాయి అనే వార్త ఒకటి తెగ వైరల్‌ అవుతుంది. ఇది కరోనా వైరస్‌ కంటే స్పీడ్‌గా అందరికీ చేరిపోతుంది. అసలు ఇంతకీ ఈ వార్తలో నిజమెంత చూద్దాం పదండీ..!
సెంట్రల్ గవర్నమెంట్ మరోసారి నల్లధనాన్ని అదుపు చేసేందుకు నడుం బిగించిందా ? గతంలో రూ. 1000, రూ.500 నోట్లు రద్దు చేసి రూ. 2 వేల నోట్లు తీసుకొచ్చిన కేంద్రం.. తాజాగా మరోసారి రూ. 2 వేల నోట్లను రద్దు చేసి తిరిగి 1000 రూపాయల నోట్లను తీసుకురానుందా ? 2023 జనవరి 1 నుంచే ఈ మార్పు రానుందా ? ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్స్ అడుగుతున్న ప్రశ్నలు ఇవి.. ఇందుకు కారణం సోషల్ మీడియాలో ఒక మెసేజ్‌ వైరల్ అవడమే..ఆ వైరల్ మెసేజ్‌లో ఏం ఉందంటే.. 2023 జనవరి 1 నుంచి రూ. 2000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్రం 1000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టబోతోందని.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వైరల్ వీడియో మెసేజ్ చూసిన జనంలో కొంతమంది అది నిజమేనని నమ్ముతున్నారు.. పైగా తెగ కమెంట్స్‌ కూడా చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ వైరల్ మెస్సేజ్‌లో నిజం లేదని స్పష్టం చేసిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం.. దయచేసి ఇలాంటి మెసేజులను ఇతరులకు ఫార్వార్డ్ చేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని సూచించింది..
అలాగే రూ. 2 వేల నోట్ల ముద్రణపైనా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్న విదితమే..2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య కొత్తగా 2000 రకం నోట్లను ముద్రించలేదనే విషయాన్ని ధృవీకరిస్తూ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులు సమాధానంలో పేర్కొంది.
పెరిగిపోతున్న 2 వేల రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లు..
కేంద్రం నల్లధనాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు నకిలీ నోట్లు ముద్రించి మోసాలకు పాల్పడుతున్న ముఠాలు చాలా ఉన్నాయి.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం 2016లో 2 వేల ఫేక్ కరెన్సీ నోట్లు 2272 పట్టుబడగా.. 2020లో ఆ సంఖ్య 2,44,834కి చేరడం గమనార్హం.
సో..అది మ్యాటర్‌. కొత్త సంవత్సంరో వెయ్యినోట్లు రీఎంట్రీ ఇవ్వనున్నాయి అనే వైరల్‌ మెసేజ్‌లో ఎలాంటి వాస్తవం లేదు. కాబట్టి మీరు ఎలాంటి హోప్స్‌ పెట్టుకోకండి.. ఎవరికీ ఆ వైరల్‌ మెసేజ్‌ షేర్‌ చేయకండే..

Read more RELATED
Recommended to you

Latest news