ఫ్యాక్ట్ చెక్: వ్యాక్సిన్ పై వచ్చిన ఫేక్ వీడియో…ఇలాంటి వాటిని అస్సలు నమ్మద్దు..!

-

సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక నకిలీ వార్త మనకి కనబడుతూనే ఉంది. స్కీమ్స్ అంటూ పెద్ద పెద్ద స్కామ్స్ ని జరుపుతున్నారు. అలానే ఫేక్ ఉద్యోగ ప్రకటనలు కూడా చేస్తున్నారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటినుండి కూడా ఇలాంటి నకిలీ వార్తలు ఎక్కువైపోయాయి. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి కూడా ఫేక్ వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఒక నకిలీ వార్త రాగా దానిపై కేంద్రం స్పందించింది.

మంగళవారం నాడు ఒక వీడియో ని పోస్ట్ చేసి అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది కేంద్రం. అయితే ఇంతకీ ఆ నకిలీ వార్త ఏమిటి ఆ వీడియో లో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. కరోనా మహమ్మారి వలన ఇబ్బంది రాకుండా ఉండాలని వ్యాక్సిన్ తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే 15 నుండి 18 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది కాదంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తే వాళ్లు చనిపోతున్నారు అంటూ ఫేక్ ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పీఐబీ ఫాక్ట్ చెక్ స్పందించి.

ఈ వీడియో లో ఏ మాత్రం నిజం లేదని చెప్పింది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పిల్లలలో కలగడం లేదని కేవలం ఇది నకిలీ వార్త అని చెప్పింది. కనుక ఇలాంటి నకిలీ వార్తలని అస్సలు నమ్మొద్దు. అలానే ఇలాంటి నకిలీ వార్తలని ఇతరులకి కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఇటువంటి వార్తలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news