ఏపీ సీఎస్ కు సుప్రీం కోర్ట్ సమన్లు.. కోవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యమే కారణం

-

కోవిడ్ కారణంగా మరణించిన వారికి పరిహారం అందించాలని గతంలో సుప్రీంకోర్ట్ రాష్ట్రాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రాష్ట్రాలు కూడా కోవిడ్ బారిన పడి మరణించిన వారి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించేలా ఏర్పాట్లు కూడా చేశాయి. అయితే పరిహారం అందించే విషయంలో మాత్రం జాప్యం ఏర్పడుతోంది.

తాజాగా కోవిడ్ బారిన పడి మరణించిన వారికి ఇచ్చే పరిహారంలో జాప్యంపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించే విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఉన్నప్పటికీ.. పరిహారం చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సీఎస్ లకు సమన్లు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ గా విచారణకు హాజరు కావాలని.. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని హెచ్చరించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news