ఫ్యాక్ట్ చెక్: ఆక్సిజన్ కొరత కారణంగా జనం కుప్పకూలిపోతున్నారా..? ఈ వీడియోలో నిజమెంత..?

కరోనా వైరస్ కేసులు భారతదేశంలో ఎక్కువైపోతున్నాయి. ఆక్సిజన్ కొరత కూడా మనం చూస్తున్నాం. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా జనం వీధుల్లో కుప్పకూలిపోతున్న వీడియో వైరల్ అవుతోంది. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు కరోనా వైరస్ తో కుప్పకూలి పోతున్నారు అని నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో నిజమెంత అనేది చూద్దాం..!

కరోనా వైరస్ కేసులు ఎక్కువైతున్న మాట నిజమే. అలానే ఆసుపత్రి లో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడిన మాట నిజమే. కానీ ఆక్సిజన్ కారణంగా జనం రోడ్డు మీద కుప్పకూలిపోతున్నారు అనే దానిలో ఎటువంటి నిజం లేదు.

ఫాక్ట్ చెక్: ఇప్పటికే చాలా మంది పాకిస్తాన్ యూజర్స్ ఈ వీడియోని షేర్ చేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా భారత దేశం లో ప్రజలు రోడ్డు మీద కుప్పకూలిపోయారు అని పాకిస్తానీ యూజర్ ఉమర్ అన్వర్ తెలిపారు. మేము ఇండియా తో పాటు నిలబడ్డాము వారి కోసం ప్రార్థన చేస్తాము అన్నారు. అలానే ప్రధాని ఎంత వీలైతే అంత వేగంగా ఇటువంటి వాళ్లకి సహాయం చేయాలని అందర్నీ స్ట్రాంగ్ గా ఉండమని ఆయన రాశారు.

అయితే ఈ వీడియోలో నిజమెంత…? ఈ విషయానికి వస్తే… ఈ వీడియో లో జనం వీధుల్లో పడిపోతున్నట్టు మనం చూడొచ్చు. ఈ వీడియోలో ఉన్న ఆంబులెన్స్ నెంబర్ ప్లేట్ చూస్తే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు.

ఆ తర్వాత గూగుల్ లో ఫోటోలు చూస్తుంటే బయట పడింది ఏంటంటే..? ఇది కరోనా వైరస్ కి సంబందించిన వీడియో కాదని ముఖ్యంగా ఈ వీడియో ఈ సంవత్సరం లోనిది కాదని ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన సమయం లోది అని తెలుస్తోంది. అయితే ఇది మే 7, 2020 లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో అని తేలింది.