ఫ్యాక్ట్ చెక్: రూ.12,500 కడితే 4.6 కోట్లని రిజర్వ్ బ్యాంక్ ఇస్తోందా…? నిజమెంత..?

ఈ మధ్య కాలంలో ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. చాలా మంది ఫేక్ వార్తలను నమ్మి అనవసరంగా మోసపోతున్నారు. తాజాగా మరోక వార్త వచ్చింది. అయితే అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. చాలా మందికి తాజాగా మెసేజ్లు వస్తున్నాయి.

ఆ మెసేజ్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.6 2 కోట్ల రూపాయలని ఇస్తుందని.. దీని కోసం మీరు కేవలం పన్నెండు వేల ఐదు వందలు రూపాయలని కట్టాలని ఉంది. అయితే నిజంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా డబ్బుని ఇస్తోందా..? ఇందులో నిజమెంత అనేది చూస్తే… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి మెసేజ్లని పంపలేదని ఇది కేవలం ఫ్రాడ్ మెసేజ్ అని తెలుస్తోంది.

మోసగాళ్లు ఇలాంటి మెసేజ్లు పంపించి ప్రజల్ని మోసం చేస్తున్నారని అర్థమవుతుంది. జనాన్ని మోసం చేస్తూ మోసగాళ్లు 12,500 రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో అయితే జనాన్ని మోసం చేయడానికి ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేశారు.

అదే విధంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఫోటో ని కూడా ఫేక్ వెబ్సైట్లో పెట్టారు. దీనిపై పీఐబీ ఫాక్ట్ చెక్ కూడా స్పందించింది. ఇటువంటి మెసేజ్లను నమ్మొద్దని.. ఇది కేవలం నకిలీ మెసేజ్ అని చెప్పింది. కనుక ఇలాంటి వాటితో జాగ్రత్తగా వుండండి. లేదంటే మోసపోవాల్సి ఉంటుంది.