స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కరోనా పాజిటివ్

మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. దుల్కర్ సల్మాన్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని.. హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపాడు. ఇంతకు ముందు దుల్కర్ తండ్రి మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దుల్కర్ మళయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. మహానటి, కనులు కనులను దోచాయంటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. త్వరలో తెలుగులో స్ట్రేయిట్ సినిమా చేయబోతున్నారు. మళయాళంతో పాటు తెలుగులో కూడా దుల్కర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

థర్డ్ వేవ్ లో పలు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వరసగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, త్రిష, కీర్తి సురేష్, థమన్, విక్రమ్, వడివేలు, కమల్ హాసన్ వంటి వారు కరోనా బారి పడి కోలుకున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ ఫలితంగా పలు సినిమాల విడుదల కూడా వాయిదా పడింది. ప్యాన్ ఇండియా సినిమాలు రాధే శ్యాం, ట్రిపుల్ ఆర్ సినిమాలకు కరోనా దెబ్బ తాకింది.