ఫ్యాక్ట్ చెక్… పీరియడ్స్ సమయంలో మహిళలు వాక్సిన్ తీసుకోకూడదా..?

-

ఓ వైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ మరో వైపు కరోనాకు కళ్ళెం వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసాయి. మన దేశంలో జ‌న‌వ‌రి 16వ తేదీన ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైన విష‌యం తెలిసిందే. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వగా… ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు, మార్చి ఒక‌టో తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత ఏప్రిల్ ఒక‌టి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అయితే కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న సమయంలో మహిళలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళలు పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, పీరియడ్స్‌కు 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవద్దని ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వ్యాక్సిన్ వేసుకున్న తొలి రోజుల్లో ఇమ్యూనిటీ తగ్గుతుందని, ఈ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని దాని సారాంశం.

సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతుండడంతో మహిళలో అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లని నమ్మవద్దని , 18 ఏళ్లు నిండిన మహిళలంతా ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news