ఫ్యాక్ట్ చెక్: కారు గెలుచుకునే అవకాశాన్నిచ్చిన టాటా గ్రూప్… నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయం నుండి అనేక ఫేక్ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మరొక వార్త వచ్చింది. అయితే అది నిజమా కాదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాటా గ్రూప్ 150 వార్షికోత్సవం సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. కంపెనీ 150 వ వార్షికోత్సవం సందర్భంగా ఒక లింక్ ఉండి… ఆ లింక్ ని క్లిక్ చేస్తే కార్ ని గెలుచుకోవచ్చు అని దానిలో ఉంది. అయితే నిజంగా కారుని గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని టాటా గ్రూప్ ఇచ్చిందా అనేది చూస్తే… దీనిపై టాటా గ్రూప్ స్పందించి ఎలాంటి బహుమతులు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి మేము బాధ్యులం కాము అని చెప్పేసింది.

Image

ఇలాంటి లింకులు ఏమైనా వస్తే దయచేసి క్లిక్ చేయవద్దు మరియు ఫార్వర్డ్ చేయద్దు అని చెబుతోంది. టాటా గ్రూప్ లింక్ మీద క్లిక్ చేస్తే కారు గెలుచుకోవచ్చు వంటి మెసేజ్ లు కనుక వచ్చాయంటే అసలు మీరు వాటిని నమ్మొద్దు. తప్పక మీరు మోసపోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి లింక్స్ తో జాగ్రత్తగా ఉండండి. ఇదిలా ఉంటే ఇటువంటివి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. కేవలం టాటా గ్రూప్ ఏ కాకుండా డిమార్ట్, తాజ్ హోటల్స్ మొదలైన వాటికి సంబంధించి ఫేక్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news