స్వగ్రామంలో రెక్కీ…?
డ్రోన్లతో చిత్రీకరించిన వైనం
గ్రామంలో తీవ్ర భయాందోళనలు
మంత్రి స్వగ్రామానికి వచ్చినపుడు సెక్యూరిటీని పక్కనబెట్టి గ్రామస్తులతో కలసిపోతారు. ముసలీ ముతకా తేడా లేకుండా అందరితో ఆత్మీయంగా మాట్లాడతారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ, ఇళ్లల్లోకి చొరవగా చొచ్చుకెళుతూ అందరినీ పలకరిస్తూ ఉంటారు. తనకు బాగా సన్నిహితంగా ఉండే ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇండ్లల్లోకి వెళ్లి, అందరి బాగోగులు తెలుసుకుంటారు. ఇటువంటి సందర్భాన్ని ఆసరాగా తీసుకుని దాడిచేస్తే, గ్రామం నుంచి పొలాల మీదుగా సురక్షితంగా తప్పించుకోవచ్చన్న భావనతో వారు ఈ రెక్కీ చేసి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్‌రెడ్డి మళ్లీ ఘనవిజయం సాధించే వాతావరణం స్పష్టంగా కనబడుతుండడం, సర్వేలన్నీ అదే చెబుతూండడంతో పాత నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారింది. భౌతికంగా నిర్మూలిస్తే గాని తమకు అవకాశం రాదని తలచిన వాళ్లు, ఈ ప్రయత్నాలు మొదలుపెట్టిఉంటారని మంత్రి అనుయాయులు, బంధుగణం భావిస్తున్నారు.