బ్యాంకింగ్ సంస్థలు, INSURANCE సంస్థలు మనుషుల అవసరాలను తమ స్వార్ధం కోసం ఉపయోగించుకోవడానికి వచ్చినవే క్రెడిట్ కార్డులు అని తెలిసిందే. ఇప్పటికి మనకు మార్కెట్ లో చాలా రకాలు అయిన క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భారతదేశంలో బిలియనీర్ గా ఉన్న ప్రముఖ్ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ గ్రూప్ నుంచి అతి త్వరలోనే క్రెడిట్ కార్డు విడుదల కానుందట. ఇందుకోసం అదానీ గ్రూప్ అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్ ప్రెమెంట్స్ సంస్థ వీసా తో ఒప్పందాన్ని చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అదానీ గ్రూప్ మరియు వీసా లు కలిసి ఒక క్రెడిట్ కార్డు ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇంకా ఈ కార్డు వలన ఎయిర్ పోర్ట్ సర్వీస్, రిటైల్, ఆన్లైన్ ట్రావెల్ సర్వీస్ లను ఉపయోగించడానికి వీలుగా ఉండేలా రూపొందించనున్నారట.
ఆధానీ గ్రూప్, VISA ల నుండి క్రెడిట్ కార్డ్ … !
-