నోరూరించే చేపల పులుసు

-

చేపలు తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వైద్య నిపుణులు కూడా చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు.  గుండె సమస్యలు ఉన్నవారు వారంలో కనీసం 2 సార్లు చేపలను తీసుకుంటే మంచిది. వీటి వల్ల మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. సో.. నోరూరించే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా..?

కావల్సిన పదార్థాలు:

చేపలు : 1 కిలో
చింతపండు : కొద్దిగా (నీటిలో నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి : 4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ : 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం : 1 టేబుల్‌స్ఫూన్
నూనె : 3 టేబుల్‌స్ఫూన్స్
పసుపు : 1 టేబుల్‌స్ఫూన్
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర : కొద్దిగా (తరుగు)
ధనియాల పొడి : 1 టేబుల్‌స్ఫూన్
జీలకర్ర పౌడర్ : 1 టేబుల్‌స్ఫూన్
గసగసాలు పొడి : 1 టేబుల్‌స్ఫూన్
యాలకులు : 3
లవంగాలు : 4
దాల్చిన చెక్క : 2
వెల్లుల్లి : 1
కరివేపాకు : 3 రెమ్మలు

చేపల పులుసు తయారీ

:
ముందుగా గసగసాలు, యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో శుభ్రం చేసి పెట్టుకొన్న చేపముక్కలు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం, ధనియాలపొడి, జీలకర్ర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫిష్ బౌల్లో కొద్దిగా నూనె, మొదట గ్రైండ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ వేసి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మంటను పూర్తిగా తగ్గించి, చేపముక్కలున్న బౌల్ పెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. ఉడికే ముందుగానే కొద్దిగా ఉప్పు కూడా చేర్చి పెట్టుకోవాలి. ఈ గ్రేవీ మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి. మూత పెట్టి, 10 నిముషాలు అలాగే ఉంచి, 5 నిముషాల తర్వాత చేపలు మెత్తగా ఉడికాయని నిర్ధారించుకొన్న తర్వాత కరివేపాకు, చింతపులుసు పోసి ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే, స్పైసీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ..

Read more RELATED
Recommended to you

Latest news