హెల్త్ అలర్ట్: మండిపోయే ఎండలు… అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి !

-

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. మనకు ఉన్న మూడు సీజన్ ల కన్నా ఈ సీజన్ లోనే ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. సూర్యుని నుండి వెలువడే వేడిమిని తట్టుకోలేక అల్లాడిపోతారు. ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు రికార్డ్ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మాములుగా ఎప్పుడూ ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం మరీ ఎక్కువగా ఎండలు ఉండడం బాధాకరం అని చెప్పాలి. రోజులో సాధారణ డిగ్రీల కన్నా కూడా రెండు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు IMD తెలియచేసింది.

నిన్న రెంటచింతలలో అత్యధికంగా 42 .6 డిగ్రీలు, నెల్లిమర్ల లో 41 .9 డిగ్రీలు, రాజాంలో 41 .8 డిగ్రీలు, కర్నూల్ 41 .5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కాగా ఈ రోజు అడ్డతీగల , నెల్లిపాక , చింతూరు , గంగవరం, నర్సీపట్నం, మాకవరపాలెం తో పాటు 26 మండలాల్లో వడగాలులు వీస్తాయని IMD తెలిపింది. ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news