వేసవి కాలంలో ఎండలు విపరీతంగా మండిపోతు ఉంటాయి. అటువంటి సమయంలో ఏదైనా చల్లని టూర్ వేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. మీరు కూడా ఈ వేసవికి ఏదైనా చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీని చూడాల్సిందే. IRCTC ఎన్నో టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది తాజాగా IRCTC మరో కొత్త ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు మంచిగా కాశ్మీర్ వెళ్లి వచ్చేయొచ్చు ఇక ఐఆర్సిటిసి తీసుకొచ్చిన కాశ్మీర్ టూర్ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం.
ఐఆర్సిటిసి అదిరిపోయే ఆఫర్ ని ఒకటి తీసుకు వచ్చింది తక్కువ ధర లో కాశ్మీర్ టూర్ వేసి వచ్చేయొచ్చు. మే పదకొండున హైదరాబాద్ మీదగా సేవలు ప్రారంభిస్తున్నట్లు సౌత్ స్టార్ రైలు ప్రతినిధులు చెప్పారు. భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ పథకంలో భాగంగా సౌత్ స్టార్ కొత్త రైల్వే సేవలను అందిస్తుంది. ఇక ఈ టూర్ కి సంబంధించిన మరిన్ని వివరాలను చూద్దాం.
వేసవి కనుక టూర్ ప్యాకేజీ లో భాగంగా కాశ్మీర్ కి ప్రత్యేక రైలు మొదలుపెట్టారు. ఈ రైలు కోయంబత్తూర్ నుండి మొదలవుతుంది. హైదరాబాద్, వరంగల్, ధర్మపురి, విజయవాడ మీదుగా ఇది వెళుతుంది. జమ్ము కాశ్మీర్ తో పాటుగా ఇతర ప్రాంతాలని కూడా మీరు ఈ టూర్ లో భాగంగా చూసేయచ్చు. 12 రోజుల టూర్ ఇది. జూలైలో ఈ టూర్ కోసం మీరు బుక్ చేసుకోవచ్చు. జూలై లో ఏ రోజులు టూర్ ఉంది అనేది మీరు IRCTC వెబ్సైట్ కి వెళ్లి చూడచ్చు. బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ తో పాటు సమాచారం కోసం ఈ నెంబర్ కి డయల్ చేయొచ్చు.