IPL 2023 : RCB ఫ్యాన్స్ ను బెదిరించిన గంభీర్..వీడియో వైరల్

-

ఐపీఎల్ 2023లో సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు దుమ్ము రేపింది.

లక్నో బౌలర్లను చితక్కొడుతూ 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మాక్స్ వెల్ చిచ్చర పిడుగులా రెచ్చిపోయాడు. ఇక ఛేజింగ్‌ కు దిగిన లక్నో ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ అనంతరం.. లక్నో మెంటర్‌ గౌతమ్‌ గంభీర్‌ బెంగళూరు ఫ్యాన్స్‌ పై సీరియస్‌ అయ్యారు. ఇక అరవకండి అంటూ.. రెచ్చిపోయాడు గౌతమ్‌ గంభీర్‌. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news