ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు..!

-

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ని కొనాలని అనుకుంటున్నారా..? అది కూడా తక్కువ ధరకే కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ అదిరే ఆఫర్స్. ఫ్లిప్‌కార్ట్ మరో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌తో తిరిగి వచ్చింది. దీనిలో భాగంగా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ ని కొనుగోలు చెయ్యచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పోకో, రెడ్ మీ, సాంసింగ్ మొదలైన ఫోన్స్ తక్కువ ధరకే వస్తున్నాయి.

 

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఆఫర్ లో పోకో M4 ప్రో (కూల్ బ్లూ, 128 GB) (6 GB RAM) ఫోన్ ని రూ. 16,499 కి కొనుగోలు చెయ్యచ్చు. దీని అసలు ధర రూ. 19,999 గా వుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో 17% తగ్గింపుతో దీన్ని పొందొచ్చు.

అలానే ఇంఫినిక్స్ నోట్ 11s (మిత్రిల్ గ్రే, 64 GB) (6 GB RAM) ఫోన్ ని రూ. 12,499 కి కొనచ్చు. అసలు ధర అయితే రూ. 16,999 గా వుంది. రెడ్ మీ నోట్ 10T 5G (మెటాలిక్ బ్లూ, 64 GB) (4 GB RAM) స్మార్ట్ ఫోన్ ని రూ. 13,999 కి కొనచ్చు. అయితే దీని అసలు రూ. 16,999 గా వుంది. 17% తగ్గింపుని ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే శాంసంగ్ గాలక్సీ F22 (డెనిమ్ బ్లూ, 64 GB) (4 GB RAM) ని రూ. 12,999 గా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999 గా వుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో 13% తగ్గింపుతో లభిస్తుంది. ఇది ఇలా ఉంటే రెడ్ మీ నోట్ 10S (షాడో బ్లాక్, 128 GB) (6 GB RAM) ఫోన్ ని రూ. 14,999 కి పొందొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 18,999 గా వుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో21% తగ్గింపుతో లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news