మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మార్క్ క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి కూడా దళిత మహిళ తానేటి వనితకు హోం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ అప్పగించారు. గతంలో కూడా ఈ శాఖను మహిళ మేకతోటి సుచరితకు అప్పగించారు. ప్రస్తుతం ఈమెను తప్పించి అదే స్థానాన్ని తానేటి వనితకు కేటాయించారు.
తనకు అత్యున్నత హోంశాఖను కేటాయించడంపై తానేటి వనిత చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఇంతకుముందు మహిళా, శిశు సంక్షేమ శాఖ ను నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ నమ్మకంతో హోంశాఖను అప్పగించారో దానికి న్యాయం చేస్తానని అన్నారు. రెండోసారి క్యాబినెట్ లో అవకాశం కల్పించడం, హోంశాఖను అప్పగించడాన్ని ఊహించలేదని… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తానని ఆమె అన్నారు. మహిళల భద్రతకు ముఖ్యమంత్రిగారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. మహిళ భద్రతపట్ల ముఖ్యమంత్రికి ఓ విజన్ ఉందని…వేధింపుల నుంచి మహిళలను కాపాడాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని… వారికి మంచి అవకాశాలు కల్పించాలని సీఎం పాటుపడుతున్నారని.. క్యాబినెట్ లో కూడా మహిళకు పెద్దపీట వేశారని ఆమె అన్నారు.