చదువు మీద ఆసక్తి ఉన్న వారు ఎవరైనా చదువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరు. అలాంటి వారికి ఆ సరస్వతి దేవి అన్ని విధాలా వారికి సహాయంగా ఉంటుంది. కాగా తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అయ్యో పాపం అనేలా ఉంది. తెలంగాణాలో ఈ రోజు నుండి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రోహిత్ అనే టెన్త్ క్లాస్ విద్యార్థి తండ్రి నిన్న రాత్రి అనారోగ్యం కారణంగా మరణించారు. కానీ శవానికి అంత్యక్రియలు జరగడానికి ఈ రోజు సాయంత్రం వరకు సమయం పడుతుంది.
కానీ రోహిత్ మాత్రం ఉదయాన్నే టెన్త్ క్లాస్ పరీక్ష రాయడానికి వెళ్లాల్సి ఉంది. ఈ కఠినమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఆ విద్యార్థి తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తండ్రి శవం ఇంట్లో పెట్టుకుని పరీక్షను రాయడానికి వెళ్ళాడు. ఈ పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు మరియు చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమయ్యారు.