పుదీనా సాగులో అనువైన నేలలు.. మేలైన సస్యరక్షణ చర్యలు..

-

కొత్తిమీర పుదీనా.. మసాల వంటల్లో వీటి ఎంట్రీ లేదంటే.. ఆ డిష్ అట్టర్ ఫ్లాపే. రుచితో పాటు.. మంచి పోషకాలు ఉన్న కొత్తిమీర పుదినా సాగుకు ఈరోజుల్లో మంచి డిమాండ్ ఉంది. పుదినాను సలాడ్స్ లో, పచ్చళ్ల తయారీలో, టీ చేసుకుని తాగడానికి ఇలా వివిధ రకాలుగా వాడుతుంటారు. అంతేనా.. పుదీనా నూనె తీసి.. దాన్ని కూడా వాడేస్తుంటారు. అలాంటి పుదీనా సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మంచి లాభాలు పొందవచ్చు.

పుదీనా సాగుకు అనువైన నేలలు..

పుదీనా సాగుకు సమశీతోష్ణ ఉష్ణ ప్రాంతాలు అనువైనవి. సారవంతమైన అధిక సేంద్రీయ పదార్ధాలుగల తేలిక పాటి ఇసుక నేలలు, నుండి మురుగు నీరు పోయే వసతిగల తేలిక పాటి ఒండ్రునేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే పల్లపు నేలలు సాగుకు పనికి రావు.

పుదీనా సాగులో రకాలు..

జపనీస్ మింట్, స్పియర్ మింట్, పెప్పర్ మింట్, బెర్గామాట్ మింట్ గించేది. మార్కెట్లో మనకు లభించేది స్పియర్ మింట్ రకం. పుదీనాను కాండం, ముక్కలుగా నాటుకోవటం ద్వారా సాగు చేసుకోవచ్చు. వేరుతో గల కాండం ముక్కలు 4 నుండి 5 సెం.మీ పొడవుతో 2 కణుపులు కలిగిన మొక్కలు ఎన్నుకోవాలి. ఎకరాకు 4క్వింటాళ్ళ కాండం ముక్కలు అవసరం అవుతాయి. కాండం ముక్కలను కార్బండిజమ్ 1గ్రా లీటరు నీటికి లేదా కాప్టాన్ 3గ్రా లేదా, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాలు ఉంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్లును అరికట్టవచ్చు. ఆకు కూరకోసం సంవత్సరం పొడవునా పొదినాను సాగుచేసుకోవచ్చు..
ఆకు కూరకోసం సాగుచేసే పంటలో వీలైనంత వరకు ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకపోవటమే మంచిది. వేప సంబంధిత క్రిమి సంహార కాలను ఉపయోగించవచ్చు.. తప్పనిసరైతే ఆకుతినే పురుగుల నివారణకు మలాథియాన్ 2మి.లీ లేదా నువాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పుదీనాలో తెగుళ్ళ సమస్య తక్కువగానే ఉంటుంది. నేల ద్వారా సంక్రమించే కాండం కుళ్ళును అరికట్టడానికి పంట మార్పిడిని పాంటించాలి. పుదీనాను మొక్కజొన్న, ఆలుగడ్డ, వరి, చిరుధాన్యపు లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు.. కాండం కుళ్లు నివారణకు విత్తనశుద్ధి పాటించాలి. ఆకు మాడు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఇక వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మాగిన పశువుల ఎరువు 70 కిలోలకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి, 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయటం వల్ల ఎండు తెగులును అరికట్టవచ్చు. పుదీనా సాగులో పంటమార్పిడి తప్పనిసరిగా పాటించాలి.

కోసే పద్ధతి..

నాటిన 3నెలలకు మొదటి కోత వస్తుంది. మొదటి కోతలో మొక్కల మొదళ్లను 5సెం.మీ వదిలిపెట్టి కోయాలి. రెండవ కోత భూమికి దగ్గరగా కోయాలి. రెండు కోతల్లో ఆకు దిగుబడి ఎకరాకు 10 నుండి 12టన్నులు వస్తుంది. నూనె దిగుబడి ఎకరాకు 65 నుండి 75 కిలోలు వరకూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news